📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణఓవర్ లోడింగ్ వాహనాలపై రవాణా శాఖ కొరడా

ఓవర్ లోడింగ్ వాహనాలపై రవాణా శాఖ కొరడా

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిది//
రాజన్న సిరిసిల్ల:

రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు మరియు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో (ఓవర్ లోడింగ్) ప్రయాణిస్తున్న వాహనాలపై శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ,మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ లు, (AMVI) శ్రీ పృథ్వీరాజ్ వర్మ మరియు రాజిని దేవి పాల్గొన్నారు.ప్రమాదాలకు ప్రధాన కారణం అధిక లోడే: AMVI పృథ్వీరాజ్ వర్మతనిఖీల సందర్భంగా AMVI పృథ్వీరాజ్ వర్మ మాట్లాడుతూ, రహదారులపై జరిగే అధిక శాతం ప్రమాదాలకు ఓవర్ లోడింగ్ వాహనాలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. పరిమితికి మించి లోడును రవాణా చేయడం వల్ల వాహనం నియంత్రణ కోల్పోయి, వాహనదారులతో పాటు ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒక వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.అదేవిధంగా, AMVI రాజిని దేవి కూడా అధిక లోడుతో వెళ్తున్న మరో వాహనాన్ని గుర్తించి సీజ్ చేశారు. వాహన చట్టాలు, నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, భవిష్యత్తులో కూడా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వారు తెలిపారు.
వాహనదారులు తమ వాహనాలలో నిర్ణీత పరిమితికి మించి లోడును తరలించవద్దని రవాణా శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular