📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుస్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న మన్నె వారి జలాల్పూర్ యువత

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న మన్నె వారి జలాల్పూర్ యువత

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నర్సాపూర్.జనవరి1
వెల్దుర్తి మండలం మన్నె వారి జలాల్పూర్ గ్రామంలో గురువారం నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంగి కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ యువత, పంచాయతీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని గ్రామంలోని వీధులు, పరిసరాలను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కలిసి శ్రమించారు.ఈ కార్యక్రమంలో రంగి కృష్ణ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం తనవంతు కృషిని ఎల్లవేళలా కొనసాగిస్తానని తెలిపారు. గ్రామ యువత అందించిన సహాయ సహకారాలు మరువలేనివని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular