📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణరోడ్డునే హోటల్ గా మార్చారు

రోడ్డునే హోటల్ గా మార్చారు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 9: నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని బైపాస్ రోడ్డులో గల కార్తికేయ రెస్టారెంట్ మరియు బ్యాంకెట్ హాల్ యజమాని హోటల్ ముందుగల రోడ్డును కూడ హోటల్ గా మార్చేశారు.హోటల్ స్థలం కంటే ఎక్కువగా రోడ్డును ఆక్రమించారు. పూర్తిగా రోడ్డుపై కుర్చీలు,టేబుల్స్ వేసి, వాహనాల పార్కింగ్ చేస్తూ,రోడ్డుపై ప్రయాణించేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.మున్సిపల్ అధికారులు పోలీసులు ప్రతీరోజు గమనిస్తున్న హోటల్ యాజమానులకు హెచ్చరించకపోవడం,రోడ్డుపై సామాగ్రిని, వాహనాలను తొలగించాలని మందలించకపోవడం గమనార్హం.ఏది ఏమైనా నారాయణఖేడ్ పట్టణంలోని రోడ్లపై వ్యాపారస్థులు తమ దుకాణంలోని విక్రయ సామాగ్రీని పూర్తిగా రోడ్లపై ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారులు హెచ్చరించకపోవడం కొసమెరుపు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular