📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణసౌదీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టీపీసీసీ చీఫ్ పరామర్శ

సౌదీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టీపీసీసీ చీఫ్ పరామర్శ

📰 Generate e-Paper Clip

– బాధిత కుటుంబాల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్న కాంగ్రెస్

హైదరాబాద్, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
సౌదీ అరేబియాలో జరిగిన దారుణ బస్సు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ వాసుల కుటుంబాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. అడిక్ మెట్ అచ్యుత్ మార్గ్ ప్రాంతంలో పర్యటించిన ఆయన, కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపంత్ కుమార్, నాంపల్లి ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కాంగ్రెస్ తరఫున మహేష్ గౌడ్ భరోసా ఇచ్చారు. మృతదేహాల రప్పింపు, ఆర్థిక సహాయం, కుటుంబ సభ్యులకు అవసరమైన మద్దతు అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషాద సమయంలో బాధితులకు ప్రభుత్వం మరియు పార్టీ కలసికట్టుగా సహాయం చేస్తుందని నాయకులు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular