📄 ePaper
Monday, July 27, 2026
Homeఆంధ్రప్రదేశ్“ఈ ప్రశ్నకు జవాబు ఎవరిది సారు?”తుఫాన్ మధ్య పాఠశాలలునిర్వహించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం.

“ఈ ప్రశ్నకు జవాబు ఎవరిది సారు?”తుఫాన్ మధ్య పాఠశాలలునిర్వహించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 2
తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో పాఠశాలలను నిర్వహించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. చలి తీవ్రత మధ్య చిన్నారులను స్కూల్‌కు రప్పించడం బాధ్యతారాహిత్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గత మూడు రోజులుగా పాఠశాల భవనాలు పూర్తిగా తడి అవ్వడంతో విద్యార్థులు కూర్చునేందుకు కూడా అనువైన పరిస్థితులు లేవని తల్లిదండ్రులు చెప్పారు. ఇటువంటి ప్రతికూల వాతావరణంలో పాఠశాలలు ఎందుకు నిర్వహించారో, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించేశారు.ఈపరిస్థితుల్లో పాఠశాలలు కొనసాగించడం తగదని జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సూచించినప్పటికీ, సొంత నిర్ణయాలతో స్కూళ్లు నిర్వహించడం అర్థరహితమని తల్లిదండ్రులు మండిపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular