📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమహిళల భద్రతకే మా ప్రాధాన్యత: సిద్దిపేట షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

మహిళల భద్రతకే మా ప్రాధాన్యత: సిద్దిపేట షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గ సూచనలు-వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీమ్‌ను సంప్రదించాలి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం,ఫిబ్రవరి20:
మహిళల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సిద్దిపేట షీ టీమ్ ఆధ్వర్యంలో నేడు సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2బిహెచ్‌కే కే.సి.ఆర్ నగర్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గ పాల్గొని మాట్లాడుతూ, మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా మౌనంగా ఉండకుండా వెంటనే షీ టీమ్‌ను సంప్రదించాలని సూచించారు. షీ టీమ్ ఎలా పనిచేస్తుంది, ఆపదలోఉన్న మహిళలకు ఎలా సహాయం అందిస్తుందో వివరించారు.ఈవ్ టీజింగ్ (వీధివేధింపులు), సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, అంతర్జాల దౌర్జన్యం, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై లైంగిక వేధింపులు‘మంచి స్పర్శ – చెడు స్పర్శ’ గురించి కూడా వివరించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్నియమాలు మరియు టీ-సేఫ్ యాప్ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఎక్కడైనా, ఎప్పుడైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే డయల్ 100 కు లేదా సిద్దిపేట షీ టీమ్ నంబర్ 8712667434 కు సమాచారం ఇవ్వాలని కోరారు. బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఇన్‌స్పెక్టర్ దుర్గ తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ సహాయ ఉపనిరీక్షకుడు కిషన్ పవార్, మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ రజిని, మమత, పోలీస్ కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular