📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపులిమామిడి సర్పంచ్ బరిలో యమ్మాజీ నర్సాగౌడ్.

పులిమామిడి సర్పంచ్ బరిలో యమ్మాజీ నర్సాగౌడ్.

📰 Generate e-Paper Clip

మన ప్రజాప్రతినిధి — చేగుంట మండలం, దుబ్బాక నియోజకవర్గం, మెదక్ జిల్లా
చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా యమ్మాజీ నర్సాగౌడ్ బరిలో దిగుతున్నట్టు సోమవారం ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. గ్రామ ప్రజల సమస్యలు తీర్చడం, ప్రతి ఇంటి అభివృద్ధి కోసం పనిచేయడమే తన లక్ష్యమని తెలిపారు.దుబ్బాక నియోజకవర్గ నాయకుల అండదండలతో, మండల నాయకులు – కార్యకర్తల సహకారంతో గ్రామంలోని ప్రతి పని చేసి చూపుతానని నర్సాగౌడ్ చెప్పారు.గ్రామంలోప్రజలతోకలిసిమెలిసిఉండే,సమస్యలనుదగ్గరగాపరిశీలించిపరిష్కరించేవ్యక్తిననితెలిపారు.“ప్రజల సేవ కోసం రాజకీయ రంగంలోకి వచ్చాను. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటాను” అని నర్సాగౌడ్ హామీ ఇచ్చారు. ప్రజల్లో ఉండి సేవ చేయడం తనకు ఎంతో సంతృప్తి ఇస్తుందని పేర్కొన్నారు.పులిమామిడి గ్రామ ప్రజలు కూడా నర్సాగౌడ్ పట్ల ఉన్న అభిమానం వ్యక్తం చేస్తూ, ఆయనలాంటి ప్రజాసేవకుడితోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని కోరుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular