📄 ePaper
Friday, August 28, 2026
Homeఫ్యాషన్కొత్త లుక్ఫిట్‌నెస్ ముందు తానే తనతో పోరాటం..

ఫిట్‌నెస్ ముందు తానే తనతో పోరాటం..

📰 Generate e-Paper Clip

కీర్తిసురేశ్‌ ఓపెన్‌ కామెంట్స్‌ వైరల్

చెన్నై, నవంబర్‌ 23,మనప్రజాప్రతినిధి:

సినిమాల్లో గంభీరమైన పాత్రలు, నిజ జీవితంలో సింపుల్‌ నేచర్‌.. ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీర్తిసురేశ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాయి. పక్కా ప్రొఫెషనల్‌గా పేరున్న ఈ నటి ఫిట్‌నెస్‌పై ఎంత ఫోకస్‌ పెడుతుందో తెలిసిందే. అయితే ఆ ఫిట్‌నెస్‌ను కొనసాగించడం తనకు అంత ఈజీ కాదని ఆమె స్వయంగా ఒప్పుకుంది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తిసురేశ్‌.. తాను మంచి ఫుడ్‌ లవర్‌ని అని, ఇష్టమైన భోజనాన్ని కంట్రోల్‌ చేసుకోవడమే తనకు అతిపెద్ద ఛాలెంజ్‌ అని చెప్పింది. తిండిపై ఉన్న ప్రేమను తగ్గించుకోవడం కోసం రోజూ తానే తనతో పోరాడుతుంటానని ఆమె నవ్వుతూ చెప్పుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. కఠినమైన డైట్‌ను సరిగ్గా పాటించడం తనకు చాలా కష్టం అని, అయితే ఫిజిక్‌ మెయింటైన్ చేయాలంటే డిసిప్లిన్ తప్పనిసరి అని ఆమె స్పష్టం చేసింది.
అయితే ఏ విషయంలోనూ రాజీ పడని నైజం కీర్తిసురేశ్‌దే. ఫుడ్‌పై లవ్ ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైస్ చేయనని, సమయం దొరికినప్పుడల్లా జిమ్‌, యోగా, వర్కౌట్స్‌కు ప్రాధాన్యం ఇస్తానని చెప్పింది. తన ఈ మాటలు ముఖ్యంగా యువతకు ఇన్‌స్పిరేషన్‌గా మారుతున్నాయి. అందుకే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ‘రియల్‌, రెలేటబుల్‌ క్వీన్’ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న తర్వాత కీర్తిసురేశ్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేది’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కెరీర్‌తో పాటు ఫిట్‌నెస్‌ను కూడా సమతూకంగా కొనసాగిస్తున్న కీర్తిసురేశ్‌ చేసిన ఈ నిజాయితీగల వ్యాఖ్యలు ఇప్పుడంతా సోషల్ మీడియాలో చర్చగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.