📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅంగన్‌వాడి సరుకు అంగడిపాలు – అధికారులు స్పందన

అంగన్‌వాడి సరుకు అంగడిపాలు – అధికారులు స్పందన

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి / మెదక్
నవంబర్ 26

టేక్‌మాల్ మండలంలోని కాదులూరు అంగన్‌వాడి కేంద్రంలో సరుకుల దుర్వినియోగం జరుగుతున్నట్లు మన ప్రజా ప్రతినిధి పత్రికలో వచ్చిన కథనంపై అధికారులు వెంటనే స్పందించారు.

సూపర్వైజర్ నాగమణి సోమవారం కాదులూరు అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించి రికార్డులు, సరుకుల వివరాలను పరిశీలించారు. కేంద్రానికి పంపిన కొంత సరుకును టీచర్ అమ్మినట్లు ప్రాథమిక నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి సమగ్ర నివేదికను మెదక్ జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని, బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అంగన్‌వాడి విభాగ అధికారులు తెలిపారు.


RELATED ARTICLES
- Advertisment -

Most Popular