📄 ePaper
Saturday, June 27, 2026
Homeతెలంగాణసిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం లొ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం లొ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి(సిద్దిపేట నవంబర్ 19):

ప్రజా సేవే,ప్రజా శ్రేయస్సే,ప్రజా ఆరోగ్యం మే మా ధ్యేయం పూజల హరికృష్ణ ఈ రోజు సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ (Chief Minister Relief Fund) చెక్కులను ఘనంగా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు స్వయంగా చేపట్టి లబ్ధిదారులకు చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వైద్య సహాయం కోసం ఎవరైనా ఎదురుచూస్తే, మా ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటాం. సిద్దిపేట ప్రజలకు సేవ చేయడం మా కర్తవ్యమూ, నా బాధ్యత కూడా” అని తెలిపారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఈ వైద్య సహాయం తమకు పెద్ద తోడ్పాటు అయ్యిందని పేర్కొంటూ హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్,చిన్న కోడూరు మండల అధ్యక్షులు మీసం మహేందర్,అర్బన్ అధ్యక్షులు బిక్షపతి,దాస అంజన్న అర్షద్,వాహబ్,అజమాత్ రషద్,కొత్త మహిపాల్ రెడ్డి,ఎర్ర మహేందర్,చోట అజమాత్,మహిళా నాయకులు మార్క పద్మ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్య‌క్ర‌మాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular