📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునూతన జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు

నూతన జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip


మన ప్రజా ప్రతినిధి / రాజన్న సిరిసిల్ల
నవంబర్ 23

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎడుముల భూపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన మల్లేష్ యాదవ్, మైనారిటీ విభాగం నాయకుడు ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.
నాయకులు శాలువా అర్పిస్తూ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యకర్తలతో సమన్వయం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చ జరగింది.ఈ సందర్భంగా వీరబోయిన మల్లేష్ యాదవ్ గారు మాట్లాడుతూ.
సంగీతం శ్రీనివాస్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలపడుతుందని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చేర్చడంలో తాము చురుకుగా పనిచేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచేలా కృషి చేస్తామని తెలిపారు.
తద్వారా జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గారు స్పందిస్తూ—
పార్టీ బలోపేతం తమ మొదటి లక్ష్యమని, ప్రతి కార్యకర్తను కలుపుకుని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.