📄 ePaper
Wednesday, July 15, 2026
Homeఆంధ్రప్రదేశ్నేవీ డే సర్గమ్ కార్యక్రమానికి విశాఖ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌

నేవీ డే సర్గమ్ కార్యక్రమానికి విశాఖ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌

📰 Generate e-Paper Clip

ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారుల పరామర్శ
విమానాశ్రయంలో ఘన స్వాగతం
నేడు జరగనున్న నేవల్ సింఫనిక్ సర్గమ్‌కు ముఖ్య అతిథి
విశాఖపట్నం, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):
నేవీ డే ముందస్తు వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న “సర్గమ్ – ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు.ఈసందర్భంగావిమానాశ్రయంలో ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చెందిన కీలక అధికారులు, ప్రాంతీయ ప్రజాప్రతినిధులు కలిసి ఆయనకు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రినిస్వాగతించేందుకు నేవల్ ఆఫీసర్ ఇంచార్జ్ కామోడర్ రజనీష్ శర్మ, కమాండర్ వై.కె. కిషోర్ నేతృత్వంలోనినేవీఅధికారులుముందువరసలో ఉన్నారు. వారితో పాటు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, వంశీ కృష్ణయాదవ్,సుందరపువిజయ్ కుమార్,పంచకర్లరమేష్తదితరులుపాల్గొన్నారు.జిల్లాకలెక్టర్‌తోసహాఇతరఉన్నతాధికారులు కూడా ఉప ముఖ్యమంత్రిని విమానాశ్రయంలో అభినందించారు. సర్గమ్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా దేశ భద్రతకై నేవీ చేస్తున్న కృషిని సంగీత రూపంలో ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. విశాఖపట్నంలోని ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. నేవీ డే కు ముందు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, సైనిక స్ఫూర్తిని ప్రజలలో వ్యాప్తి చేయడంతో పాటు, నేవీ సిబ్బందిపై గౌరవాభివృద్ధి చెందేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈరోజు జరిగే సర్గమ్ కార్యక్రమంలో పలు ప్రతిష్టాత్మక సంగీత ప్రదర్శనలు ఉండనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular