📄 ePaper
Thursday, October 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన.

కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన.

📰 Generate e-Paper Clip

దేశానికి గేమ్‌చేంజర్ ప్రాజెక్ట్ : కిషన్ రెడ్డి
160 ఎకరాల్లో అత్యాధునిక తయారీ యూనిట్
మొదటి దశలో ₹521 కోట్లు – వేగం, ప్రమాణాలపై మంత్రి సంతృప్తి
దేశవ్యాప్తంగా చిన్న–మధ్య దూర రైలు ప్రయాణాలను మెరుగుపర్చే రేకు తయారీవరంగల్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):
కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కేంద్ర మంత్రి గి. కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు పనులు వేగం, ప్రమాణాలతో అనుగుణంగా సాగుతున్నాయన్న విషయం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ వరంగల్ ప్రాంత అభివృద్ధికిపెద్దమలుపుతిప్పబోతోందనిపేర్కొన్నారు.ఈమాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ 160 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం అవుతోంది. మొదటి దశలోనే ₹521 కోట్లువెచ్చించబడుతున్నాయని, దీనికి సంబంధించిన సదుపాయాలు దేశంలోనే అత్యాధునిక ప్రమాణాలతో ఉంటాయని వెల్లడించారు. పనుల నిర్మాణంలో సస్టైనబుల్ పద్ధతులు, పర్యావరణహిత సాంకేతికాలు, ఆధునిక యంత్రాంగం విస్తృతంగా వినియోగంలో ఉన్నాయని మంత్రి వివరించారు. దేశ రైల్వే రంగాన్ని భవిష్యత్తులో మరింత సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడంలో ఈ యూనిట్ కీలకం కానుందని పేర్కొన్నారు. మొదటి దశలో 16–20 కోచ్‌లతో కూడిన అత్యాధునిక రేకులను ఈ యూనిట్ తయారు చేయనుంది. వీటి ద్వారా చిన్న, మధ్య దూర రైలు ప్రయాణం దేశవ్యాప్తంగా మరింత సులభంగా, వేగంగా, సురక్షితంగా మారనుందని మంత్రి అన్నారు. కాజీపేట RMU పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత వరంగల్ పరిశ్రమల రంగానికి, స్థానిక ఉపాధికి, టెక్నాలజీ ఆధారిత వృద్ధికి విపరీతమైన అవకాశాలు లభిస్తాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.