📄 ePaper
Thursday, October 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిద్దిపేటలో జరిగే ‘దీక్ష దివాస్’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం — నూనె కుమార్ యాదవ్.

సిద్దిపేటలో జరిగే ‘దీక్ష దివాస్’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం — నూనె కుమార్ యాదవ్.

📰 Generate e-Paper Clip

మన ప్రజాప్రతినిధి — కొండపాక మండలం
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని సిద్దిపేటలో భారీ స్థాయిలో విజయవంతం చేయాలని కొండపాక బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ అన్నారు. దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.“తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ సచ్చుడో” అన్న ధైర్యంతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిన నిరాహార దీక్ష ప్రారంభమైన రోజుకు 16 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, రేపు ఉదయం 10 గంటలకు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పూలమాలలు సమర్పించి, బైకు ర్యాలీని ప్రారంభిస్తామని తెలిపారు.తరువాత ముస్తాబాద్ చౌరస్తా వద్ద కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారని చెప్పారు. అక్కడి నుంచి బైకుల ర్యాలీగా రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించి, చివరిగా పొన్నాలలోని సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున దీక్ష దివాస్ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, బిఆర్ఎస్ గజ్వేల్ ఇంచార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డితోపాటుజిల్లాముఖ్యనాయకులుహాజరుకానున్నారనివెల్లడించారు.కొండపాకమండలంలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ తాజా మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని నూనె కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.