Friday, February 27, 2026
ads
Homeతెలంగాణమూన్ లైట్ కేఫ్ అండ్ బాక్స్ క్రికెట్ ప్రారంభం 

మూన్ లైట్ కేఫ్ అండ్ బాక్స్ క్రికెట్ ప్రారంభం 

📰 Generate e-Paper Clip

సదాశివపేట నవంబర్ 24 (మనప్రజాప్రతినిధి)


సదాశివపేట పట్టణంలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మూన్ లైట్ అండ్ బాక్స్ క్రికెట్ ను ఏర్పాటు చేసిన టి. కార్తీక్ అండ్ మేనేజ్మెంట్ వారికి పులిమామిడి రాజు మొదటగా హార్దికశుభాకాంక్షలు తెలియ జేశారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత ఎవ్వరి మీద ఆధార పడకుండా స్వయం ఉపాధి శక్తితో ఫై స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. నేటి కాలంలో చదువుకున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుందని, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కాంపిటీషన్లో భాగంగా తగ్గుతున్నాయని అందుకోసమే నేటి యువత ఉద్యోగాలపై ఆధారపడకుండా ఏదో ఒక స్వయం ఉపాధిని కల్పించుకొని తమ తెలివితేటలతో ముందుకు కొనసాగాలని సూచించారు. నేటి కాలంలో ప్రతిఒక్కరికి డబ్బుతో పాటు ఆయురారోగ్యాలు అవసరమని అందుకోసం శారీరక ఫిట్నెస్ అవసరమని, ఈ నెట్ క్రికెట్ అనేది చాలా వరకు ఉపయోగ పడుతుందన్నారు. కావున ప్రతి ఒక్క యువకుడు ఈ మూన్ లైట్ బాక్స్ క్రికెట్కు విచ్చేసి తమ యొక్క శారీరక దృఢత్వాన్ని, మరియు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు అన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని సదాశివపేట ప్రజలకు  కల్పించినందుకుగాను తాలెల్మ ఈశ్వర్ మరియు వారి కుమారుడు తాలెల్మ కార్తీక్ లను అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో టి.రాము, శివ, చంద్ర శేఖర్, పవన్, నవీన్, బిల్లకంటి శ్రీనివాస్, సోమ శంకర్, అనిల్ మరియు పి.. ఎం. ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular