📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణఎన్నికల సమయాన  మహిళలను మళ్లి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఎన్నికల సమయాన  మహిళలను మళ్లి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి(అక్బర్ పేట భూంపల్లి,నవంబర్ 24):

అక్బర్ పేట భూంపల్లి మండలం లోని కవిత శ్రీనివాసగౌడ్ ప్రెష్మిట్.
ఎన్నికల సమయాన మహిళలను మోసం చేస్తుందని. పంచాయతీ  ఎన్నికలు రావడంతో  కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని.గత ప్రభుత్వంలో 18 సంవత్సరాల నుండి ప్రతి  ఒక్క మహిళకు బతకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘంలో  ఉన్న వాళ్లకు మాత్రమే అని చెప్పి మహిళలను మరో మారు మోసం చేస్తూ తన దుర్బుద్ధిని మరోసారి బయట పెట్టిందని. బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం సీనియర్ నాయకులు పంజలా కవిత శ్రీనివాసగౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…మహిళలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామిలను వేంటనే ఆమలు పర్చాలమహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని గోప్పలు చెప్పి. విద్యార్థులకు స్కూటీలని చెప్పి ఇలా మహిళా మణులను పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి మోసం చేయడానికి మరో కోణంలో ఇందిరమ్మ చీరలను మహిళా సంఘాలలో ఉండే సభ్యురాళ్లకే అని కాంగ్రెస్ మరోమారు ఆడపడుచులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఫస్ట్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం హామిలను ఆమలు పర్చాలని డిమాండ్ చేశారు.మిగతా మహిళలకు ఓట్లు లేవా అని 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఓట్లు వేయరా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాన్ని  మా ఆడపడుచులు గ్రహించాలని. రాబోయే స్థానిక  ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా అయన తెలియజేశారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular