Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుR&B రోడ్డు సమస్యలపై వినతి పత్రం అందజేత..

R&B రోడ్డు సమస్యలపై వినతి పత్రం అందజేత..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రూరల్ – నవంబర్ 24, 2025.

సిద్దిపేట  రూరల్ మండలంలోని రావురూకుల గ్రామం ప్రధాన రహదారి తీవ్ర దుస్థితి కారణంగా గ్రామ ప్రజలు నిత్యజీవితంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు కట్ట పక్కగా వెళ్లే ఈ రహదారి వర్షాకాలంలో పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారడంతో విద్యార్థులు, రైతులు, అత్యవసర సేవలకు భారీ అంతరాయం ఏర్పడుతోంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్దిపేట కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్ గ్రామ ప్రజల తరఫున వినతిపత్రాన్ని సిద్ధం చేసి సమర్పించారు.
ప్రజవాణి కార్యక్రమం సందర్భంగా ఈ వినతిపత్రాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గారికి, R&B శాఖ అధికారులకు, మరియు EE గార్లకు అధికారికంగా అప్పగించారు.
వినతిపత్రం స్వీకరించిన అధికారులు రహదారి పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతు పనులు త్వరితగతిన చేపడతామని హామీ ఇచ్చారు.
రావురూకుల గ్రామ ప్రజలు సమస్య త్వరలో పరిష్కారమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular