📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురామేశ్వరంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పల్లె అనిత అనిల్ ప్రకటింపు

రామేశ్వరంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పల్లె అనిత అనిల్ ప్రకటింపు

📰 Generate e-Paper Clip

మన ప్రజా ప్రతినిధి// అక్బర్ పేట్–భూంపల్లి
అక్బర్ పేట్ భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన మండల ఎసి సెల్ ఉపాధ్యక్షులు పల్లె అనిత అనిల్ గ్రామాసర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు.గ్రామ ప్రజల సమస్యలను తీర్చడం, అభివృద్ధి పనులను పూర్తిచేయడం తమ ప్రధాన లక్ష్యమని ఆమె వెల్లడించారు. దుబ్బాక నియోజకవర్గ నాయకుల అండదండలతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, స్థానిక రాజకీయ ప్రముఖుల సహకారంతో గ్రామంలోని ప్రతి పని సాధించి చూపుతానని స్పష్టం చేశారు.గ్రామ ప్రజల్లో తనకు ఉన్న గుర్తింపు, ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించే ధోరణి తనకు బలం అని పల్లె అనిత అనిల్ తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయ రంగంలోకి వచ్చానని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండే నాయకత్వం చూపుతానని ఆమె అన్నారు.గ్రామ అభివృద్ధి ప్రజా సేవకుడి చేతిలోనే సాధ్యమని పేర్కొంటూ, రామేశ్వరంపల్లి గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular