📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసర్పంచులకు ప్రజల ఓట్లు కావాలి… కానీ గ్రామాభివృద్ధి మాత్రం పక్కనపెడుతున్నారు

సర్పంచులకు ప్రజల ఓట్లు కావాలి… కానీ గ్రామాభివృద్ధి మాత్రం పక్కనపెడుతున్నారు

📰 Generate e-Paper Clip

సదాశివపేట, నవంబర్ 27 (మన ప్రజాప్రతినిధి)
గ్రామ ప్రజలు విశ్వాసంతో ఎన్నుకున్న సర్పంచులు అభివృద్ధి పనుల విషయంలో ముందుకు రావాల్సిన సమయంలో, కొంతమంది మాత్రం గ్రామాలలో వర్గీయతలకు తావిచ్చి పనులను అడ్డుకుంటున్నారని విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పల్లె ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచులే స్వలాభం కోసం గొడవలకు దిగడం సమంజసం కాదని పలువురు బాధపడుతున్నారు. ప్రభుత్వ నిధులు మంజూరు అయినా కూడా, గ్రామాభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సిన నాయకులు ప్రతీకార రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అభివృద్ధి విషయంలో ఓర్పు లేక పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వర్గాలను రెచ్చగొడుతున్న నాయకత్వం గ్రామాల్లో ఐక్యతను దెబ్బతీస్తోందని పెద్దఎత్తున జనాభిప్రాయం వినిపిస్తోంది. యువతను మద్యం మత్తులో ముంచి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే దారుణ పరిస్థితులు. గ్రామపంచాయతీలవిలువలనుమరింతక్షీణింపచేస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, చదువుకున్న యువత ముందుకు వచ్చి గ్రామ ప్రజల్లో అవగాహన పెంచి, నిజంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకులు ఎవరన్నది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని “మన ప్రజా ప్రతినిధి” కోరుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.