📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమల్లికార్జున స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు అంగరంగ వైభవంగా..

మల్లికార్జున స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు అంగరంగ వైభవంగా..

📰 Generate e-Paper Clip

గజ్వెల్ నియోజకవర్గం.

సిద్దిపేట జిల్లా

మన ప్రజా ప్రతినిధి//

కొండపాక మండలం

కొండపాక మండలంలోని మర్పడగ గ్రామంలో ఉన్న శ్రీ విజయదుర్గ మల్లికార్జున స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం గణపతి పూజతోప్రారంభమైనఈవేడుకలురోజంతాభక్తిసాంద్రంగాకొనసాగాయి.క్షేత్ర నిర్వాహకుడు చెప్పాల హరినాధ శర్మ ఆధ్వర్యంలో విజయదుర్గ మాతకు ప్రత్యేక పూజలు, స్వస్తి వాచనం, కళాశాల స్థాపన, నవగ్రహ స్థాపన, స్థాపిత దేవతల పూజలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు పంచామృతం, ఫలరసాలతో విశేష అభిషేకం చేశారు.స్వామివారిని పెట్టు వస్త్రాలతో అలంకరించి, వేదమంత్రాల నడుమ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణలో మోహన్ కృష్ణ శర్మ, వేదవ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
వేడుకల అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయబడింది.
ఈ సందర్భంగా క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు చికోటి మల్లికార్జున్, నరసింహారెడ్డి, గట్టు విట్టల్, బాల రాజేశం, మరియాల రవీందర్, వీరేశం, రాజు, మల్లేశంతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.