📄 ePaper
Thursday, July 16, 2026
Homeఆంధ్రప్రదేశ్దిత్వా తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

దిత్వా తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

ప్రాణ–ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోండి: కలెక్టర్
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.
తిరుపతి, నవంబర్‌30
దిత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి ప్రాణ–ఆస్తి నష్టం జరగకుండా వెంటనే ముందస్తు సహాయక ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయడు తో కలిసి శనివారం ఆర్‌డీఓలు, విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ“దిత్వా తుఫాను నవంబర్‌ 30న తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా 30 మరియు డిసెంబర్‌ 1 తేదీల్లో శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తాయి” అని పేర్కొన్నారు.
అధికారులకు కలెక్టర్ సూచనలు
• ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా• నీటి ప్రవాహం అధికంగాఉన్నప్రాంతాల్లోవెంటనేబారికేడ్లుఏర్పాటుచేయాలి•లోతట్టుప్రాంతప్రజలనుసురక్షితప్రదేశాలకుతరలించిపునరావాసంకల్పించాలి•ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉండటంతోపశువుల కాపరులు మైదానాలకు వెళ్లరాదు• తుఫాను పూర్తిగా తగ్గే వరకుమత్స్యకారులు వేటకు వెళ్లకూడదు• విద్యుత్, పంచాయతీరాజ్, వైద్య సిబ్బంది ఫుల్ అలర్ట్‌లో ఉండాలి24×7 కంట్రోల్ రూమ్‌లుజిల్లా కలెక్టర్ వెల్లడించిన వివరాలప్రకారంఅన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లాసచివాలయంలో కూడా 30వ తేదీ రాత్రి నుంచే కంట్రోల్ రూం పనిచేయనుంది.ప్రజలు ఏవైనా అత్యవసర అవసరాలకు తక్షణమే సంప్రదించవచ్చన్నారు
టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular