📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణపవన్ పేషీలో సురేష్ లేరు

పవన్ పేషీలో సురేష్ లేరు

📰 Generate e-Paper Clip

– వైసీపీ దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు: జనసేన
– ఉపముఖ్యమంత్రి కార్యాలయంపై వైసీపీ ప్రచారంపై జనసేన ఆగ్రహం
– సురేష్ అనే వ్యక్తి లేరని పార్టీ స్పష్టం
– ఆరోపణలు చేసిన వారిపై కేసులు వేసేందుకు సిద్ధమైన న్యాయవిభాగం

అమరావతి, 16  (మనప్రజాప్రతినిధి):
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీపై వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని జనసేన పార్టీ ఖండించింది. పవన్ కార్యాలయంలో సురేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడని, అతను అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఉద్దేశపూర్వకమైన దుష్ప్రచారమేనని పేర్కొంది. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి, పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఈ ఆరోపణలను జెనసేన అభివర్ణించింది. పవన్ పేషీలో సురేష్ అనే పేరుతో ఎవరూ పనిచేయడం లేదని పార్టీ స్పష్టం చేసింది. గతంలో కూడా అనేక అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ, ఇప్పుడు ఉపముఖ్యమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని జెనసేన నాయకత్వం మండిపడింది. పవన్ కల్యాణ్ ప్రజాసేవ, పారదర్శకతపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్న సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పార్టీ వ్యాఖ్యానించింది.ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ఈ తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ, నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలను ప్రచురించిన కొన్ని వర్గాలు కూడా దీనికి కారణమని జనసేన విమర్శించింది. అధికార ప్రతిష్ఠను కించపరచే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని, ఇలాంటి చర్యలను పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తమ న్యాయవిభాగం ఇప్పటికే రంగంలోకి దిగిందని జనసేన తెలిపింది. నిరాధార ఆరోపణలు చేసినవారిపై మాత్రమే కాకుండా, వాస్తవాలను నిర్ధారించకుండా ప్రచురణలకు పాల్పడిన మీడియా సంస్థలపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది. తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు చట్టపరమైన మార్గాల్లోనే పోరాటం కొనసాగిస్తామని జెనసేన స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.