📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువెల్టూరు గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన తొంట రాజు

వెల్టూరు గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన తొంట రాజు

📰 Generate e-Paper Clip

సదాశివపేట, నవంబర్ 28 (మన ప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో శుక్రవారం తొంట రాజు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో నుంచే పని చేస్తానని ఆయన తెలిపారు. గ్రామంలో చిన్నా–పెద్దా తేడా లేకుండా అందరికి సహాయం చేస్తూ మంచి పేరు పొందిన రాజు, నామినేషన్ అనంతరం మాట్లాడుతూ “గ్రామస్థుల మద్దతు ఉంటే మీ కొడుకులా, మీ తమ్ముడిలా, మీ అన్నలాగా ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను. గ్రామ సమస్యలను పై అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు ప్రయత్నిస్తాను. పగలు–రాత్రి ఏ సమయంలోనైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ చేస్తే వెంటనే అందుబాటులో ఉంటాను” అని తెలిపారు. నామినేషన్ సందర్భంలో వార్డుమెంబర్లు, గ్రామ పెద్దలు, యువతరం సంతోషం వ్యక్తం చేస్తూ “తొంద రాజు సర్పంచ్ జయహో” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.