📄 ePaper
Sunday, July 12, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇంటింటాప్రచారంఒక్కసారిఅవకాశంఇస్తేఅభివృద్ధిచేసిచూపిస్తాసర్పంచ్అభ్యర్థిబొమ్మమల్లయ్య

ఇంటింటాప్రచారంఒక్కసారిఅవకాశంఇస్తేఅభివృద్ధిచేసిచూపిస్తాసర్పంచ్అభ్యర్థిబొమ్మమల్లయ్య

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్13
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కొండపాక మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బొమ్మ మల్లయ్య ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రజలకు తెలియజేశారు.గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులుగా మార్కెట్ యార్డ్ నిర్మాణం, గ్రామంలోని మోరీల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు, అలాగే గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేపడతానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫుట్‌బాల్ గుర్తుకు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బొమ్మ మల్లయ్య కోరారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని ఫుట్‌బాల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular