📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుస్నేహపూర్వక పోటీతత్వంతోమెలగాలిడీఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి

స్నేహపూర్వక పోటీతత్వంతోమెలగాలిడీఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,డిసెంబర్5(మనప్రజాప్రతినిధి)
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఓటరు, అభ్యర్థి స్నేహపూర్వకంగా వ్యవహరించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ గైను సమీపంలో స్థానిక ఎన్నికలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడారు.ఎన్నికలు ఐదేళ్లకోసారి జరిగే ప్రజాస్వామ్య పండుగ అని, గొడవలు సృష్టించడం, నియమావళిని అతిక్రమించడం వంటివి కఠిన చర్యలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. సాధారణ కేసుల కంటే ఎన్నికల సమయంలో నమోదు అయ్యే కేసులు తీవ్రమైనవని, అలాంటి కేసులు ఉన్నవారిని ప్రతి ఎన్నికల సమయంలో బైండోవర్ చేస్తారని తెలిపారు. అలాంటి కేసులు ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్‌ను ఖచ్చితంగా పాటించాలని, అధికారుల విధులకు ఆటంకం కలిగించినా చట్టరీత్య చర్యలు తప్పవని చెప్పారు. ఏవైనా ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.అభ్యర్థులు మద్యం లేదా డబ్బులు పంపిణీ చేసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ఈ నెల 9వరకు మాత్రమే అనుమతించబడుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయరాదని తెలిపారు.పోలింగ్ బూత్‌లలో మొబైల్‌ ఫోన్లను నిషేధించామని, ఓటు వేయడానికి ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఓటర్‌ స్లిప్‌తో రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ జార్జ్, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు, పోలీసులుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.