📄 ePaper
Sunday, July 12, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజాసేవ చేసే వారినే సర్పంచ్‌గా ఎన్నుకోండి

ప్రజాసేవ చేసే వారినే సర్పంచ్‌గా ఎన్నుకోండి

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్,సీపీఐ.నేతల మంజె మల్లేశం అందే అశోక్ పిలుపు
మనప్రజాప్రతినిధి//చేర్యాల.జనగామనియోజకవర్గం
జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం వీరన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొండపాక కనకలక్ష్మీ బిక్షపతికి మద్దతుగా గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు మంజె మల్లేశం, అందే అశోక్ పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా కొండపాక బిక్షపతి సర్పంచ్‌గా గ్రామానికి ఎనలేని సేవలు చేశారని తెలిపారు. కష్టకాలంలో ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి పనిచేసిన నాయకుడని కొనియాడారు. ఇతర సర్పంచ్‌లు ఆస్తులు సంపాదించుకునే దిశగా వెళ్లినప్పుడు, మాజీ సర్పంచ్ కొండపాక బిక్షపతి మాత్రం ప్రజల మనసులను గెలుచుకున్నారని పేర్కొన్నారు.కనీసం స్వంతంగా ఉండేందుకు ఇల్లు కూడా లేని స్థితిలో ఉన్నప్పటికీ, ప్రజల మద్దతుతో మరోసారి తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి ప్రజల ముందుకు రావడం ఆయన సేవా భావానికి నిదర్శనమని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి వసతులు కల్పించడమే కాకుండా, ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోని బొడ్రాయి, దుర్గమ్మ గుడులను నిర్మించి పండుగ వాతావరణం తీసుకొచ్చి న ఘనత కొండపాక బిక్షపతికే దక్కుతుంద న్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్న కొండపాక కనకలక్ష్మీ బిక్షపతిని గెలిపించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సీపీఐ నాయకులు, కొండపాక కనకలక్ష్మీ బిక్షపతి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular