📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజానకంపల్లిలో మానవత్వం చాటిన మాజీ ఎంపిటిసి బెండ రమేష్

జానకంపల్లిలో మానవత్వం చాటిన మాజీ ఎంపిటిసి బెండ రమేష్

📰 Generate e-Paper Clip

నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం, రూ.2,000 నగదు ఆర్థిక సాయం
మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా.డిసెంబర్31
మెదక్ జిల్లా, మెదక్ మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన ఉస్కె మల్లయ్య మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిన విషయం తెలుసుకున్న ఉస్కే బిక్షపతి, కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి బెండ రమేష్ మానవత్వంతో స్పందించి, నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం మరియు రూ.2,000 నగదును అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తూ ఈ సాయం అందించామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జానకంపల్లి సర్పంచ్ నెల్లి నర్సింలు, ఉప సర్పంచ్ దివిటి వెంకటేశం, లంబడి చొక్లా సర్పంచ్, లంబడి పెంటయ్య, మార్గం దేవయ్య, నేరల ఆశయ్య, కావేరి సత్తమ్మ, కాస వెంకటి, చింతల వెంకటి తదితరులు పాల్గొని, సహాయం అందించిన బెండ రమేష్‌ను అభినందించారు.గ్రామంలో నిరుపేద లకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఇలాంటి సహాయ కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.