📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుదేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి ఉద్యమాల వరకు-"సిపిఐ 100 ఏళ్లు.

దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి ఉద్యమాల వరకు-“సిపిఐ 100 ఏళ్లు.

📰 Generate e-Paper Clip

•పోరాటాల పునాదిపై నిలిచిన శతాబ్ది పార్టీ- సిపిఐ

•పోరాటాల బాటలో మరో అడుగు
•సిపిఐ ఇల్లంతకుంట మండల కార్యదర్శి కామ్రేడ్ తీపిరెడ్డి తిరుపతి రెడ్డి
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 26
సిపిఐ పార్టీ ఆవిర్భావానికి నేటితో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ తీపిరెడ్డి తిరుపతి రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1925 డిసెంబర్ 26న కన్పూర్‌లో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులతో పోరాడిందని గుర్తు చేశారు. తెలంగాణ విలీనం కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో సిపిఐ కీలక భూమిక పోషించి, లక్షలాది ఎకరాల భూమిని పేద రైతులకు పంచి, నిజాం నిరంకుశ పాలనకు తెరదించిన ఘనత సిపిఐదేనని తెలిపారు.ప్రస్తుత కాలంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కులు, జీవోల అమలు కోసం సిపిఐ నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. కార్మికులు, ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని ఉద్యమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 3న జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని, జనవరి 18న ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ ముగింపు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు 40 దేశాల నుంచి కమ్యూనిస్టు నాయకులు హాజరుకానుండగా, 15 వేల మందితో జనసేవాదళ్ కార్యకర్తల కావాతు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంద అనిల్ కుమార్, కౌన్సిల్ సభ్యులు సావనపెల్లి మల్లేశం, మండల నాయకులు ముత్యాల మల్లారెడ్డి, జుట్టు అఖిల్, వేములవాడ హరీష్, సావనపెల్లి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.