📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుదట్టమైన పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై టి. నరేష్

దట్టమైన పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై టి. నరేష్

📰 Generate e-Paper Clip

జహీరాబాద్//డిసెంబర్ 28(మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలంలో గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 5 డిగ్రీలకు పడిపోవడంతో దట్టమైన పొగమంచు కురుస్తోందని, ఈ నేపథ్యంలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోహిర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి. నరేష్ హెచ్చరించారు.డిసెంబర్ 28న ఆయన మాట్లాడు తూ, ఉదయం పూట వాహన ప్రయాణాలు సాధ్యమైనంత వరకు నివారించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉదయం ప్రయాణించాల్సి వస్తే స్వెటర్లు, హ్యాండ్ గ్లౌజులు, షూస్ ధరించి రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.వాహనదారులకు పోలీసుల సూచనలు:మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.
•అతివేగంతో వాహనాలు నడపరాదు•ద్విచక్ర వాహనదారులు •తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలిఓవర్టేక్ చేయరాదు, రాంగ్ రూట్‌లో ప్రయాణించకూడదుచెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలివాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు.ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలు వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. అలాంటి వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు లేదా యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్సై టి. నరేష్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.