📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్పెరుగుతున్నచైన్‌స్నాచింగ్‌బెడదరోడ్లపైమహిళలకుఅసురక్షితవాతావరణం

పెరుగుతున్నచైన్‌స్నాచింగ్‌బెడదరోడ్లపైమహిళలకుఅసురక్షితవాతావరణం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్ 8
తిరుపతిచంద్రగిరి ప్రధాన రహదారిపై దుండగులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. పెరుమూలపల్లి పంచాయతీ పరిధిలోని బాలాజీ అకాడమీ స్కూల్ సమీపంలో మహిళపై చైన్‌స్నాచింగ్‌ ఘటన చోటుచేసుకుంది.అగ్రికల్చర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేసిన లేట్ మునుస్వామి భార్య మల్లిక (పెరుమూలపల్లి నివాసి) కళాశాల నుండి ఇంటికి వెళ్తుండగా, ఇద్దరు మహిళలు మరియు ఆటో డ్రైవర్ ఆమెను అడ్డగించి కళ్లలో పౌడర్ చల్లి, మెడలోని బంగారు గొలుసును లాక్కొని, ఆమెను ఆటో నుండి తోసివేసి పరారయ్యారు.గాయాలపై విలవిల్లాడుతున్న బాధితురాలిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌తో రుయా ఆసుపత్రికి తరలించారు. రుయా నుండి వచ్చిన ఇంటిమేషన్‌ను ఆధారంగా తీసుకుని తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి,నింది తుల కోసం గాలింపు నిర్వహిస్తున్నారు.తిరుపతి పరిసరాల్లో చైన్‌ స్నాచింగ్ ఘటనలువరుసగా చోటుచేసుకుంటుండటంతో మహిళల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. “రోడ్లపై నడవడానికే భయంగా ఉంది… కఠిన చర్యలు తీసుకోవాలి” అని స్థానికులు వాపోయారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.