📄 ePaper
Friday, July 10, 2026
Homeఆంధ్రప్రదేశ్ప్రజాదర్బార్‌లోఅర్జీలనుస్వయంగాస్వీకరించినఎమ్మెల్యే బొజ్జలవెంకటసుధీర్ రెడ్డి

ప్రజాదర్బార్‌లోఅర్జీలనుస్వయంగాస్వీకరించినఎమ్మెల్యే బొజ్జలవెంకటసుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.డిసెంబర్12
శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌లో ఈ రోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వయంగా స్వీకరించారు.నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుతో వినిన ఎంపీటుగా, వెంటనే సంబంధిత శాఖాధికారులను పిలిపించి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ“ప్రజల సమస్యలపై ఎక్కడైనా అలసత్వం,నిర్లక్ష్యా న్ని సహించం. ప్రజలకు జవాబుదారీతనం ఉండటం మా ప్రభుత్వ ప్రధాన సిద్ధాంతం” అని స్పష్టం చేశారు.ప్రజా దర్బార్‌లో పలు సమస్య లు, అభ్యర్థనలు అధికారులకు పంపిణీ కాగా, ప్రతి సమస్య ను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular