📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్పల్స్ పోలియో దినోత్సవం:కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు చుక్కలు వేసిన డీఎస్పీ శ్రీనివాసరావు.

పల్స్ పోలియో దినోత్సవం:కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు చుక్కలు వేసిన డీఎస్పీ శ్రీనివాసరావు.

📰 Generate e-Paper Clip

రేణిగుంటలో ఘనంగా పల్స్ పోలియో దినోత్సవం – డీఎస్పీ ప్రత్యేక చొరవ
పోలియో రహిత సమాజమే లక్ష్యం: చిన్నారులకు చుక్కలు వేసిన డీఎస్పీ
మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్21
దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడ్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, రేణిగుంట పంచాయతీ కార్యాలయం సమీపంలోని పోలియో కేంద్రంలో ఆదివారం ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా, రేణిగుంట డీఎస్పీ శ్రీ శ్రీనివాసరావు కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి ప్రోత్సాహం అందించారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించా లంటే ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాల్సి ఉందని డీఎస్పీ సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని తెలిపారు, తద్వారా తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నాగేశం మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డి. జూలియన్ రాజు, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిబి సూపర్వైజర్ సుమశ్రీ లక్ష్మి, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది రేవతి, శాంత కుమారి, కళ్యాణి, అంగన్వాడీ హెల్పర్ నిర్మల తదితరులు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు కూడా హాజరై కార్యక్రమానికి మద్దతు చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.