Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుచేగుంట సర్పంచ్ అభ్యర్థిగా సండ్రుగు స్రవంతి నామినేషన్

చేగుంట సర్పంచ్ అభ్యర్థిగా సండ్రుగు స్రవంతి నామినేషన్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తెలుగు దినపత్రిక.
మెదక్ జిల్లా,చేగుంట.డిసెంబర్ 1
చేగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ సేవాసంఘ నేత సండ్రుగు సతీష్ గారి సతీమణి సండ్రుగు స్రవంతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సండ్రుగుస్రవంతి“కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ఆ విశ్వాసంతోనే నేను భారీ మెజారిటీతో గెలుస్తానని నమ్ముతున్నాను. చేగుంట గ్రామాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ పంచాయతీగా తీర్చిదిద్దడం నా మొదటి లక్ష్యం” అని పేర్కొన్నారు.అలాగే దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ సి.హెచ్. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్ మార్గదర్శకత్వంలో గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. గ్రామ సమస్యలను ఒక సంవత్సరంలోపే పరిష్కరించడానికి సంకల్పబద్ధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ప్రాధాన్యతలో ఉంటుందని తెలిపారు.
పాల్గొన్న వారుకాంగ్రెస్ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, యువనాయకులు సండ్రుగు శ్రీకాంత్, సండ్రుగు స్వామి, ఆవుసుల బ్రమ్మం, సిద్దిరెడ్డి, సోమా వెంకటేష్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular