📄 ePaper
Wednesday, September 2, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఎయిడ్స్‌పైచైతన్యంకల్పించినవిద్యార్థులుసిద్దిపేటలోర్యాలీ,సెమినార్

ఎయిడ్స్‌పైచైతన్యంకల్పించినవిద్యార్థులుసిద్దిపేటలోర్యాలీ,సెమినార్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట, డిసెంబరు 1:
ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) సిద్దిపేట మరియు కో-ఎడ్యుకేషన్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించాయి. జూనియర్ కళాశాల ప్రాంగణం నుండి ముస్తాబాద్‌ చౌరస్తా వరకు విద్యార్థులు, విద్యార్థినులు నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు.
కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ“యువత సమాజంలో మార్పుకు మార్గదర్శకులు. ఎయిడ్స్‌ నివారణలో యువత ముందుండి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. హెచ్ఐవి/ఎయిడ్స్‌ వ్యాప్తి మార్గాలపై సరైన సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి” అనిసూచించారు.సమాజంలోఅపోహలకుచోటుఉండకుండాఅవగాహనపెంచాల్సినఅవసరంఉందన్నారు.ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్‌ ఆఫీసర్ ధర్పల్లి నగేష్ మాట్లాడుతూ.
ఎయిడ్స్‌ వ్యాప్తికి ప్రధాన కారణాలు ఆసురక్షిత లైంగిక సంబంధాలు, పరిశుభ్రత లేని ఇంజక్షన్ సూదుల వాడకం, రేజర్ బ్లేడ్‌లు ఒకరినొకరు పంచుకోవడం మొదలైనవన్నారు. సురక్షిత చర్యలు, పరిశుభ్రత, జాగ్రత్తలు అత్యంత ముఖ్యమని విద్యార్థులకు వివరించారు.
ర్యాలీ అనంతరం విద్యార్థులు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ పీజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అక్కడ నిపుణులు హెచ్ఐవి/ఎయిడ్స్‌ నివారణ, చికిత్సా విధానాలు, రక్షణ చర్యల గురించి వివరించారు.కార్యక్రమంలో ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నంట శ్రీనివాస్ రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ కనక చంద్రం, ఫాతిమా, స్పోర్ట్స్ ఇంచార్జ్ అశోక్, కోచ్ వెంకటేష్, అధ్యాపకులు వెంకటరమణ, గంగాధర్, ప్రసాద్, విజయభాస్కర్, రాజశేఖర్, రఘురాజ్, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, బేతి శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, అఖిల్, రవి, కొమురయ్య, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.