📄 ePaper
Wednesday, July 15, 2026
Homeజాతియంసర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రతినిధులు

సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రతినిధులు

📰 Generate e-Paper Clip

వడోదర (గుజరాత్), మనప్రజాప్రతినిధి.డిసెంబర్ 01
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని వడోదరలో నిర్వహించిన యూనిట్ మార్చ్ కార్యక్రమంలో కేంద్ర యూత్ అండ్ స్పోర్ట్స్, కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మండవీయా గారినితెలంగాణప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి పూలగుచ్ఛం అర్పించారు. ఈ కార్యక్రమంలో తాటికొండ శ్రీనివాస్ గారు ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రమంత్రివర్యులు, “ఏక్త భారత్ శ్రేష్ఠ భారత్” అనే పిలుపునిస్తూ,సర్దార్ పటేల్ గారు భారత ఏకీకరణ కోసం అపార శ్రమపడి దేశాన్ని ఐక్యంగా నిలబెట్టిన గొప్ప నాయకుడని అన్నారు. దేశ స్వాతంత్ర్యానంతరం రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయమని గుర్తుచేశారు.అలాగే, తెలంగాణ చరిత్రలోనూ సర్దార్ పటేల్ గారి పాత్ర అపూర్వమని పేర్కొంటూ నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు అనుభవించిన అవమానాలు, రజాకారుల దాష్టిక్యాన్ని నిలువరించేందుకు “ఆపరేషన్ పోలో” చేపట్టి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను, ముక్తిని అందించిన మహనీయుడు సర్దార్ పటేల్ గారేనని తెలిపారు.అయన ఆశయాలు, దూరదృష్టి ఈ తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో మనమందరం నడవాలని కేంద్ర మంత్రి సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా తాటికొండ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ“సర్దార్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో గుజరాత్‌లో పాల్గొనడం, తెలంగాణ వ్యక్తిగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వేడుకలకు నాతో పాటు తెలంగాణ ప్రతినిధులు కూడా హాజరైనందుకు ఆనందంగా ఉంది” అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular