📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకంకల్ గ్రామంలో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు శాలువాలతో సత్కారం

కంకల్ గ్రామంలో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు శాలువాలతో సత్కారం

📰 Generate e-Paper Clip

గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సన్మానం
మునిపల్లి,డిసెంబర్27(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకల్ గ్రామంలో శనివారం అభిషేక్ ఫంక్షన్ హాల్‌లో గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిల్లోడి సతీష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి నూతన ప్రజాప్రతినిధులకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు.సందర్భంగా మాజీ ఎంపీపీ రామ్ రెడ్డి పటేల్, మాజీ వైస్ ఎంపీపీ చాంద్ పాషా, కంకల్ గ్రామ సర్పంచ్ మమత నాగేష్, ఉప సర్పంచ్ మహమ్మద్ అప్సర్, మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మక్సుద్ పటేల్, శివప్ప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడేప్ప సాఖారి, మహమ్మద్ ముఖిమ్ తదితరులు పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు, పెద్దలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రజాప్రతినిధులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.