📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్ఏర్పేడు మండలంలో రీ–సర్వే కార్యక్రమం విజయవంతం

ఏర్పేడు మండలంలో రీ–సర్వే కార్యక్రమం విజయవంతం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 26
ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామ పంచాయతీలో రీ–సర్వే కార్యక్రమానికి సంబంధించి గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శుక్రవారం జరిగింది.గ్రామ సభలో ఏర్పేడు డిప్యూటీ తాసిల్దార్ ప్రేమ్ కుమార్, పంచాయతీ ఇన్‌చార్జ్ కేకే రమణ, ఆయకట్టు ప్రెసిడెంట్ నరసింహ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు శివారెడ్డి, ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి ముఖ్యంగా పాల్గొన్నారు.అదేవిధంగా గ్రామ పెద్దలు రామచంద్రయ్య యాదవ, మల్లికార్జున్ రెడ్డి, వెంకటయ్య యాదవ, అంకయ్య, నారాయణరెడ్డితో పాటు మహిళలు, రైతులు భారీ సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో రవితేజ, సర్వేయర్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పరిధిలోని భూములకు సంబంధించిన రీ–సర్వే విధానం, భూముల హద్దులు, సర్వే నంబర్ల సవరణ అవసరం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు స్పష్టంగా వివరించారు.వచ్చే నెల నుంచి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని భూములకు రీ–సర్వే చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా హాజరై తమ భూముల వివరాలు, హద్దులు, సర్వే నంబర్లు సరిచేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.