📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిద్దిపేట జిల్లాలో గ్రామపంచాయతీ 2వ విడత పోలింగ్ 14న

సిద్దిపేట జిల్లాలో గ్రామపంచాయతీ 2వ విడత పోలింగ్ 14న

📰 Generate e-Paper Clip

12న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార నిషేధం – మద్యం దుకాణాలు సీజ్
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ కే.హైమావతి హెచ్చరిక

సిద్దిపేటజిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్11.
సిద్దిపేట జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఈ నెల 14వ తేదీ ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరుగనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పోలింగ్‌కు సంబంధించిన అక్బర్పేట్ భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక. మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం డిసెంబర్ 12న సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు.12వ తేదీ సాయంత్రం 5గంట లతర్వాత ఎలాంటి ప్రచారం చేసినా ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.అలాగే, ఎన్నిక ల నిబంధనల ప్రకారం, పై మండలాల పరిధిలోగల మద్యం దుకాణా లను 12వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి 14వ తేదీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాల యం, సిద్దిపేట జిల్లావారి ప్రకటన.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.