📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్వాజపేయిశతజయంతివేడుకలకు రేణిగుంటలోఘనంగాశ్రీకారం

వాజపేయిశతజయంతివేడుకలకు రేణిగుంటలోఘనంగాశ్రీకారం

📰 Generate e-Paper Clip

విగ్రహఆవిష్కరణలోపాల్గొన్నఎమ్మెల్యేబొజ్జల వెంకటసుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్ 15

రేణిగుంట పట్టణంలో భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీ హాజరై వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, “రేణిగుంటలో వాజపేయి విగ్రహఆవిష్కరణజరగడం ఎంతో ఆనందంగా ఉంది. దేశానికి అపూర్వ సేవలు అందించిన మహానేత వాజపేయి శత జయంతి వేడుకల్లో పాల్గొనడం నాఅదృష్టం ” అని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీకి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గుడిమల్లం ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించే బుక్‌లెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వాజపేయి జీవితం,ఆయనదేశాభి వృద్ధికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈకార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని శత జయంతి వేడుకలను ఘనంగా విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.