📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచిన్ననాటి స్నేహితుల చేత గ్రామ పంచాయతీ ప్రతినిధులకు ఘన సన్మానం

చిన్ననాటి స్నేహితుల చేత గ్రామ పంచాయతీ ప్రతినిధులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి)
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మాలపాడు గ్రామ సర్పంచ్ దేవుని సంతోష్ కుమార్ గౌడ్‌తో పాటు బొబ్బిలిగామా వార్డు సభ్యుడు శ్రీనివాస్‌ను వారి చిన్ననాటి స్నేహితులు ఘనంగా సన్మానించారు.చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు ఆదివారం ఒకచోట సమావేశమై, తమ స్నేహితులు సర్పంచ్‌గా, వార్డు సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవుని సంతోష్ కుమార్ గౌడ్‌, శ్రీనివాస్‌లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు మరింత సేవలందించాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని స్నేహితులు ఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమంలో కిరణ్, విశ్వనాథ్, చరణ్ సింగ్, కృష్ణ, మౌనేశ్వర్, జగన్, మధు, రాజు, నాగరాజ్, ఫయం నాగరాజ్, విజయ్, కుమార్ తదితర స్నేహితులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.