📄 ePaper
Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్సంక్రాంతి సంబరాల్లో రాజకీయాలకు విరామం… అభివృద్ధికి పిలుపు

సంక్రాంతి సంబరాల్లో రాజకీయాలకు విరామం… అభివృద్ధికి పిలుపు

📰 Generate e-Paper Clip

•ముగ్గుల పోటీలతో కళకళలాడిన కారాకొల్లు గ్రామం
•ఎన్నికలకే రాజకీయాలు…గ్రామాభివృద్ధికి అందరూ కలసిపని చేయాలి.

సంప్రదాయం–సేవకలిసిన వేడుకల్లో టిడిపి నేతలసందడి

కారాకొల్లు గ్రామంలోప్రజలతోమమేకమైన”జయచంద్రనాయుడు
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి17
తొట్టంబేడు మండలంలోని కారాకొల్లు గ్రామం సంక్రాంతి పండుగ వేళ పండుగ కళతో, ప్రజల ఆనందంతో సందడిగా మారింది. గ్రామ పంచాయతీలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో టిడిపి సీనియర్ నేత, తొట్టంబేడు మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పండుగ వాతావరణంలో గ్రామస్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయనకు గ్రామ ప్రజలు, టిడిపి మరియు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ముగ్గుల పోటీలను ఆసక్తిగా పరిశీలించిన జయచంద్ర నాయుడు, మహిళలను అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాభివృద్ధి రాజకీయాలకు అతీతం. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, మిగిలిన రోజుల్లో ప్రజాసేవే లక్ష్యం అని స్పష్టం చేశారు. కారాకొల్లు గ్రామంలో చేపట్టాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై గ్రామస్తులతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పూర్వ జమీందారు వంశీకులు రాజీవ్, సంజీవ్, నీటి సంఘం అధ్యక్షుడు చెంగం నాయుడు, మాజీ సర్పంచ్ రమణయ్య, బూత్ ఇంచార్జ్ వెంకట్ రమణ, గణేష్, ధర్మరాజులు తదితర టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు మరింత శోభనిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular