📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసూరారంలో అభినందన సభ-ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.

సూరారంలో అభినందన సభ-ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.

📰 Generate e-Paper Clip

సదాశివాపేట,జనవరి21(మనప్రజాప్రతినిధి):
సదాశివాపేట మండలం సూరారం గ్రామంలో సర్పంచ్ ముగ్ధం పటేల్ ఆధ్వర్యంలో అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు.సూరారం సర్పంచ్ ముగ్ధం పటేల్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హైమద్, వార్డ్ మెంబర్లు శ్రావణ్ గౌడ్, లక్ష్మయ్య, లక్ష్మి, రాజయ్య గౌడ్, కళింప పటేల్, రాజు గౌడ్, బబ్లు పటేల్, అష్రాఫ్, నర్సింలు, నాగయ్య, రాకేష్, మచ్చేందర్, శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.