📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్ఎస్సీ–ఎస్టీలకు డిటికే పట్టాలు ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

ఎస్సీ–ఎస్టీలకు డిటికే పట్టాలు ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

📰 Generate e-Paper Clip

తిరుపతిజిల్లా,జనవరి20:మనప్రజాప్రతినిధి.
పుత్తూరు మండలంలోని పలు గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటున్న ప్పటికీ డిటికే పట్టాలు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గ్రామ సభలలోను, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాలలోను ఎన్నోసార్లు వినతులు సమర్పించినా పరిష్కారం లభించకపోవడంతో తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.రంగుంట ఎస్టీ కాలనికి చెందిన టి. లక్ష్మమ్మ తడుకు లెక్కల ప్రకారం సర్వే సంఖ్య 186 లో గత పది సంవత్సరాలుగా చెట్లు తొలగించి భూమిని చదును చేసి వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయమై పుత్తూరు ఉప తాసిల్దార్‌కు డిటికే పట్టాలు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఉప తాసిల్దార్ గ్రామ రెవెన్యూ అధికారిని పంపించి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత–గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై. నందయ్యతో పాటు గ్రామస్తులు సుగుణమ్మ, నాగరాజు, టి. శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.