Friday, April 17, 2026
ads
Homeతెలంగాణఆపదలో అండ గా ముఖ్య మంత్రి సహాయ నిధి

ఆపదలో అండ గా ముఖ్య మంత్రి సహాయ నిధి

📰 Generate e-Paper Clip

– డాక్టర్ సూర్య వర్మ

మనప్రజాప్రతినిధి,సిద్దిపేట జిల్లా

ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు,ఆర్టీఏ మెంబెర్ డాక్టర్ సూర్య వర్మ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాలతో సిద్దిపేట కి చెందిన అర్హులైన లబ్ధిదారులకు రూ.ఇరవై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లుఅందజేయడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని,అది ఎప్పడు పేద ప్రజలకు అండ గా ఉంటుందన్నారు. ఆరోగ్యం బాగా లేక ఖర్చు భరించలేని ఎందరో పేద ప్రజలకు మన ప్రియతమ ముఖ్య మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఆర్ధిక సహాయం అందించడం పేద ప్రజలకి ఎంతో ఆర్ధిక ఉపశమనం అన్నారు. ఈ కార్యక్రమం లో మండల్ ప్రెసిడెంట్ లు గారిపల్లి వెంకటి , బంక చిరంజీవి యాదవ్,సర్పంచ్ బాబు పద్మ, నాయకులు దిలీప్ , మల్లేశం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular