📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణఆటపాటలతో ప్రజలను చైతన్య పరిచిన గద్దర్

ఆటపాటలతో ప్రజలను చైతన్య పరిచిన గద్దర్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 31

ప్రజా యుద్ధనౌక,తెలంగాణ పోరాట యోధుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతిని శనివారం నారాయణఖేడ్ లోని అంబేద్కర్ భవనంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన పోరాటవీరుడు గద్దర్ అన్నారు.సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేఖంగా పోరాడిన వ్యక్తి గద్దర్ అన్నారు.జయంతి సందర్బంగా ప్రభుత్వం ఆయన పేరుతో అవార్డును నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు,సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలన్నారు. నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చిరంజీవి,అశోక్,ప్రేమ్, రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్, జాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular