Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం-పేదల కలలకు రూపం ఇచ్చిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం-పేదల కలలకు రూపం ఇచ్చిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

📰 Generate e-Paper Clip

సదాశివపేట,జనవరి23(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణం 4వ వార్డులోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఫర్వీన్ సుల్తానా, ఖాజా పాషాలకు మంజూరైన ఇంటి నిర్మాణాన్ని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి శుభారంభం చేశారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని అన్నారు. పేదల సొంతింటి కలలను మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తూ నిజం చేస్తోందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందుతున్నదని పేర్కొన్నారు.లబ్ధిదారులు ఫర్వీన్ సుల్తానా, ఖాజా పాషా మాట్లాడుతూ, జీవితంలో ఎప్పుడైనా సొంత ఇల్లు ఉంటుందనే కల కూడా ఊహించలేకపోయామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తమ కల నిజమైందని, ఇది తమ జీవితాల్లో మరచిపోలేని క్షణమని ఆనందం వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, కాంగ్రెస్ నాయకులు పిల్లోడి విశ్వనాథం, ఇందిరమ్మ కమిటీ వార్డు ఇన్‌చార్జీలు మోహిస్, ముస్తఫా, శరత్, సజ్జి, శంకర్ గౌడ్, కొత్త గొల్ల చంద్రశేఖర్, పట్నం సుభాష్, గుండు రవి, అరుణ్, వీరన్న తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular