📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణపాత్రికేయులపై చులకన భావన తగదు

పాత్రికేయులపై చులకన భావన తగదు

📰 Generate e-Paper Clip

ప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లాజనవరి 8.

తుడా నా  అడ్డా అంటే కుదరదు
ఇంచార్జ్  వీసి మౌర్య     దురుసుతనం మానుకోవాలి  పరస్పర గౌరవం ముఖ్యం
మౌర్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన మీడియా మిత్రులు  ప్రజాస్వామ్యానికి మీడియా నాల్గవ స్తంభం లాంటిదని, అలాంటి మీడియా పైన వీసి మౌర్య అనుచితంగా ప్రవర్తించడ తగదని  తిరుపతి మీడియా మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుడా కార్యాలయంలో 60 సంవత్సరాల పైబడిన వారు కూడా కొనసాగుతుండడం పైన గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై వివరణ కోరడానికి తుడ ఇంచార్జి విసి మౌర్యాని కలిసిన ఏపిజేయఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు పట్ల చెప్పరాని విధంగా దురుసుగా ప్రవర్తించడంపై మీడియా మిత్రులు గురువారం తిరుపతి తుడా కార్యాలయం ముందు నిరసన తెలిపారు.వీసి మౌర్యకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.ఈ సందర్బంగా మీడియా మిత్రులు మాట్లాడుతూ మీడియా ఏదైనా విషయంపై దృవీకరణకోసం సంబందిత అధికారులను కలిసి వివరణ కోరే హక్కు బాధ్యతలలో భాగమేనని తెలిపారు. అధికారులకు ఉన్నట్లు మీడియాకు కూడా బాధ్యతలు వుంటాయని, వాటిని నిర్వర్తించాల్సి వస్తుందని అధికారిగా వీసి మౌర్య
గుర్తించకపోవటం విచారకరమన్నారు. ఇంచార్జి వీసిగా కాక,అధికార దర్పంతో హేళనగా మాట్లాడి అవమానపరచటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఎంతోమంది అదికారులు పనిచేసి వారి పదవికి వన్నెతెచ్చారని గుర్తు చేసారు. ఇలాంటి ఉన్నత స్థానంలో ఉంటున్న అధికారిణి అయిన మౌర్య మీడియా మిత్రులను తూలనాడుతూ మాట్లాడటం శోచనీయమన్నారు.అంతేకాక అధికారిగా ఆమె మాట్లాడిన మాటలకు, పశ్చాత్తాపడాల్సింది పోయి సామాజిక వర్గాల నుంచి ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగటం ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమైన మీడియాను భయపెట్టడానికి పూనుకోవటమేనని మీడియా భావిస్తున్నదన్నారు.తిరుపతి జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ గా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ గా, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఇంచార్జ్ వైస్ చైర్మన్, స్మార్ట్ సిటీ చైర్మన్ నాలుగు పదవీ బాధ్యతలు బాధ్యతలు నిర్వహిస్తూ మీడియా పట్ల అంత దురుసుగా ప్రవర్తించటం ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు.దీనికి సదరు అధికారిణి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇలాంటి అనుచిత ప్రవర్తన ఇకమీదట పునరావృతం కాకూడదన్నారు.ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర శాఖ తీసుకునిపోనున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్  ఫోరం  రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు, తిరుపతి జిల్లా కన్వీనర్లు అరవ జయపాల్, గల్లా మహేష్, నెత్తం హరిబాబు, మహా టీవీ మోహన్, బిగ్ టీవీ దామోదర్ నాయుడు, సీనియర్ జర్నలిస్టులు రూప సుందర నాయుడు , సీనియర్ జర్నలిస్ట్ బాలయ్య, తదితరులు భారీ ఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.