📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగడిపెద్దాపూర్‌లో కబడ్డీ పోటీలు ఘనం-ఆటను ప్రారంభించిన కొప్పుల శేషారెడ్డి

గడిపెద్దాపూర్‌లో కబడ్డీ పోటీలు ఘనం-ఆటను ప్రారంభించిన కొప్పుల శేషారెడ్డి

📰 Generate e-Paper Clip

మెదక్(మనప్రజాప్రతినిధి)జనవరి10
అల్లాదుర్గం మండల పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామంలో సర్పంచ్ హరికృష్ణ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి స్వయంగా కబడ్డీ ఆడి ఆటను ప్రారంభించారు.ఈ సందర్భంగా కొప్పుల శేషారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు అ య్యేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గడి పెద్దాపూర్ గ్రామంలో మరిన్ని నిర్వహించాలని సర్పంచ్ హరికృష్ణకు సూచించారు.కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో కొప్పుల శేషారెడ్డిని గ్రామ పెద్దలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరికృష్ణతో పాటు సత్యనారాయణ, అభిలాష్ రెడ్డి, నాని గౌడ్, ఉపసర్పంచ్ శ్రీశైలం, రోషన్, కుమ్మరి సాయిలు, కడాల బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular