📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు7 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలి.

7 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలి.

📰 Generate e-Paper Clip

•తహసిల్దార్ కార్యాలయం ముందు సీపీఐ ఘాటైన ధర్నా

సిద్ధాపూర్ కాలనీ సర్వే నం.260లో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే పొజిషన్ సర్టిఫికెట్లు, పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ – తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేత

సదాశివపేట,జనవరి21(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ కాలనీ సర్వే నెంబర్‌ 260లో గత ఏడేళ్లుగా పొజిషన్‌లో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే పొజిషన్ సర్టిఫికెట్లు, పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.ధర్నా అనంతరం తహసిల్దార్ బాల్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.తాజుద్దీన్ మాట్లాడుతూ-గత ఏడేళ్లుగా పూరి గుడిసెలు వేసుకుని, ఎండా వానా చలిలో ఇబ్బందులు పడుతూ అక్కడే నివసిస్తున్న పేదలకు ఇప్పటివరకు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వాలు అనేకసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు, పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షఫీ, సాదిక్ అలీ, వెంకట్, ఎం.డి. ముస్తఫా, పూలమ్మ దేవి బాయ్, బి. పాషా, సీపీఐ మునిపల్లి మండల కార్యదర్శి ఎం. గంగమ్మ, రాజమణి, యాకూబ్ అలీ, శివలీల తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.