•“వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు ప్రాధాన్యత… 81 ఫిర్యాదులు ‘మీకోసం’ కార్యక్రమంలో పరిష్కారం కోసం అందజేయ బడ్డాయి”
•“వీకే 81ఫిర్యాదులపై తక్షణ చర్య…వికలాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత”
•“మీకోసం-ప్రజాసమస్యల పరిష్కార వేదిక” కు 81 ఫిర్యాదులు స్వీకరణ
తిరుపతి,జనవరి19(మనప్రజాప్రతినిధి)
తిరుపతి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్వయంగా నియంత్రించారు.జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ వ్యక్తిగతంగా విని, వాటిపై సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరగకూడదని, వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మొత్తం 81 ఫిర్యాదులు స్వీకరించబడి, వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం అప్పగించారని వివరించారు. అదనపు ఎస్పీలు రవి మనోహరచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు, సంబంధిత సీఐలు, ఇతర పోలీస్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

